: మావోల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల


ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు అపహరించిన టీఆర్ఎస్ నాయకులు విడుదలయ్యారు. జిల్లాలోని చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో ఈ ఉదయం మావోలు వారిని వదిలిపెట్టి వెళ్లారు. కాసేపట్లో వారంతా చర్లకు చేరుకోనున్నారని తెలుస్తోంది. తమవారిని క్షేమంగా వదిలిపెట్టడంతో వారి వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మానె రామకృష్ణ, జనార్దన్, డెక్కా సత్యనారాయణ, పటేల్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సంతపురి సురేశ్ లను ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో మావోలు అపహరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News