: కేసీఆర్ వద్ద మంత్రదండమేదైనా ఉందా?... ఛత్తీస్ గఢ్ సీఎం కామెంట్


ఏపీ పునర్విభజన చట్టంతో దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తొలి నాళ్లలో విద్యుత్ కొరతతో సతమతమైంది. అయితే, ఏడాది తిరక్కుండానే పరిస్థితి తారుమారైంది. పట్టణాలతో పాటు మెజారిటీ పల్లెల్లో కోతలు లేని విద్యుత్ సరఫరా అమలైంది. విద్యుదుత్పత్తి పెరగలేదు, కొత్త ప్రాజెక్టులు రాలేదు. అయినా రాష్ట్రం విద్యుత్ కొరత బారి నుంచి అతి త్వరగా తేరుకుంది. ఇక అప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు సద్దుమణిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నాయన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ పరిస్థితులపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం వద్ద ఏదైనా మంత్రదండముందా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి మంత్రదండమేదైనా ఉంటే, తమకూ చెప్పండని కూడా ఆయన అన్నారట. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన సందర్భంగా రమణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని నిన్న హైదరాబాదు శివారులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలీ చెప్పారు.

  • Loading...

More Telugu News