: మాలి కలకలం...ఉగ్రవాదుల చేతుల్లో 1౦ మంది మృతి!


పశ్చిమాఫ్రికాలోని మాలి రాజధాని బమాకోలోని మాడిసన్ బ్లూ హోటల్ లో భారీ ఆయుధ సామగ్రితో చొరబడిన ఉగ్రవాదులు తమ అధీనంలోని బందీలలో పదిమందిని హత్య చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆటోమేటెడ్ గన్స్, బాంబులతో హోటల్ లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని కొందరు చెబుతుండగా, ఈ దాడిలో సుమారు 10 మంది ఉగ్రవాదులు పాలు పంచుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు. హోటల్ లో చిక్కుకున్నానంటూ చైనాకు చెంది వ్యక్తి చైనా మీడియా సంస్థ జిన్ హువాకు సమాచారం అందించాడు. తనతోపాటు ఇంకొంత మంది కూడా చైనీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. బందీలలో కొందరు ఖురాన్ పఠించడంతో ఉగ్రవాదులు వారిని వదిలేసినట్టు చెబుతున్నారు. కాగా, అమెరికాకు చెందిన వారి యాజమాన్యంలో నడుస్తున్న ఈ హోటల్ మాలిలో మంచి హోటల్ గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ హోటల్ ను చుట్టుముట్టాయి. హోటల్ నుంచి బయటకు దారితీసే ప్రతి దారిని దిగ్బంధం చేశారు. 170 మంది బందీల్లో 140 మంది విదేశీ అతిథులు ఉండగా, 30 మంది సిబ్బంది అని స్థానిక మీడియా తెలిపింది.

  • Loading...

More Telugu News