: బందీల్లో 140 మంది విదేశీ అతిథులే!


పశ్చిమాఫ్రికాలోని మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు, హోటల్ లో బస చేస్తున్న 170 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బందీలలో సుమారు 140 మంది వివిధ దేశాలకు చెందిన అతిథులున్నారని స్థానిక మీడియా చెబుతోంది. వీరిలో కూడా అమెరికన్లు పెద్ద ఎత్తున ఉన్నట్టు సమాచారం. సాక్షుల కథనం ప్రకారం 'గాడ్ ఈజ్ గ్రేట్' అని అరుచుకుంటూ సాయుధులైన ఉగ్రవాదులు హోటల్ లో చొరబడ్డారని చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అతిథులందర్నీ బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు ఏడవ అంతస్తు నుంచి కాల్పులు జరుపుతున్నారు. భారీ ఆయుధ సామగ్రితో హోటల్ లో తిష్టవేసుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని స్థానిక మీడియా తెలిపింది.

  • Loading...

More Telugu News