: ఇంద్రాణితో పాటు పీటర్ కూడా నిందితుడే... హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు
షీనా బోరా హత్య కేసుకు సంబంధించి నిన్న సీబీఐ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్లతో కూడిన అభియోగాలు దాఖలయ్యాయి. ఇంద్రాణిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో, అవే సెక్షన్లను పీటర్ పైనా పెట్టడం గమనార్హం. అంటే, ఈ కేసులో పీటర్ ప్రమేయం కూడా ఉన్నట్టు సీబీఐ గట్టి సాక్ష్యాలను సంపాదించిందని భావించవచ్చు. షీనాను హత్య చేసే ఉద్దేశం తనకున్నట్టు భర్త పీటర్ కు తెలుసునని ఇంద్రాణి వెల్లడించడమే పీటర్ అరెస్టుకు దారితీసింది. షీనా, తన బాయ్ ఫ్రెండ్ తో కలసి యూఎస్ కు వెళ్లిందని ఇంద్రాణి చెప్పింది అబద్ధమని పీటర్ కు ముందే తెలుసునని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.