: ఖమ్మంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణ
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఖమ్మంలోని మారుతి నెట్ వర్క్ తో పాటు సిటీ కేబుల్ లో చానల్ ను పునరుద్ధరించారు. ఇంకా సి చానల్ లో ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాల్సి ఉందని ఆ చానల్ తెలిపింది. ప్రస్తుతం 35 నెంబర్ లో ఈ చానల్ ప్రసారాలను ప్రేక్షకులు వీక్షించవచ్చని వెల్లడించింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.