: కడుపు నొప్పని వెళితే, ఆపరేషన్ చేసి కోడిగుడ్డు తీశారు!


ఓ వ్యక్తికి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు అత్యంత జాగ్రత్తగా కోడుగుడ్డును బయటకు తీశారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలో ఓ వ్యక్తి (53) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ, హుబేయ్ ప్రావిన్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో కణితి ఉందని గుర్తించారు. అనంతరం సర్జరీ చేస్తుండగా కడుపులో ఉన్నది కణితి కాదు, కోడి గుడ్డు అని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చివరకు చాలా జాగ్రత్తగా, ఏమాత్రం పగలకుండా కోడిగుడ్డును బయటకు తీశారు. అయితే, కోడిగుడ్డు కడుపులోకి ఎలా వెళ్లిందో మాత్రం అర్థం కావడం లేదు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి కూడా గుడ్డు కడుపులోకి ఎలా వెళ్లిందో చెప్పలేకపోతున్నాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News