: యప్పీ నూడిల్స్ లో ఫంగస్... హైదరాబాద్ లో సంచలనం!


యప్పీ నూడిల్స్ తిన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నారాయణ గూడకు చెందిన వసంత్ అనే వ్యక్తి యప్పీ నూడిల్స్ తిని, అస్వస్థత చెందడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఫంగస్ తో కూడిన నూడిల్స్ తినడం వల్లే అతను అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై బాధితుడు వసంత్ ఫుడ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మార్కెట్ లో యప్సీ నూడిల్స్ సంస్థ వారు కాలం చెల్లిన నూడిల్స్ ను విక్రయిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించాడు. కాగా, నూడిల్స్ యాజమాన్యం వసంత్ తో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News