: మోదీ వ్యతిరేక కూటమికి వేదికగా నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవం


బీహార్ రాజధాని పాట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ మరికాసేపట్లో పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక్క నితీశ్ కుమార్ పదవీ ప్రమాణానికే పరిమితం కాలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రదానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓ పెద్ద కూటమికే ఈ వేదిక అంకురార్పణ చేయబోతోంది. నితీశ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలు ఒకరితో మరొకరు ప్రత్యేకంగా భేటీలు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పార్టీల నేతలు బీజేపీని నితీశ్ కుమార్ మట్టికరిపించిన వైనంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాక భవిష్యత్తులో కూటమిగా జట్టుకడితే ఎలాగుంటుందన్న కోణంలోనూ చర్చలు జరిపే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే కీలక నేత, ఆ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా ప్రచారంలోకి వచ్చిన ఎంకే స్టాలిన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో నిన్న రాత్రే ఫోన్ లో మాట్లాడారట. ఈ సందర్భంగా కూటమి దిశగా పలు ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News