: ఇంకా తెలియని టీఆర్ఎస్ నేతల ఆచూకీ... నిన్న కిడ్నాప్ చేసిన మావోలు
మావోయిస్టులు నిన్న కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ నేతల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఖమ్మం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో ఆరుగురు నేతలు నిన్న కిడ్నాప్ కు గురయ్యారు. ఆధునిక సాంకేతికతను కూంబింగ్ పార్టీలు ఉపయోగిస్తుండటంతో... మావోలు సెల్ ఫోన్లను కూడా వాడటం లేదు. ఈ క్రమంలో, వీరి జాడను కనుక్కోవడం కష్టతరంగా మారింది. అడవిలో నుంచి ఎవరి ద్వారానైనా సమాచారం బయటకు వస్తే తప్ప వీరి ఆచూకీ దొరికే పరిస్థితి కనబడటం లేదు. ఇంతవరకు సదరు నేతల ఆచూకీ తెలియకపోవడంతో... నాయకుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.