: ఒబామాకు ఎదురుదెబ్బ, అధ్యక్షుడు నిర్ణయాన్ని కాదన్న సెనెట్... హ్యాండిచ్చిన 47 మంది డెమొక్రాట్లు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరియా నుంచి వస్తున్న శరణార్థులను అనుమతించాలని ఆయన నిర్ణయం తీసుకోగా, సెనెట్ దాన్ని వ్యతిరేకించింది. ఒబామా సొంత పార్టీ డెమొక్రాట్ కు చెందిన 47 మంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. పారిస్ దాడుల తరువాత సమావేశమైన సెనెట్, శరణార్థులపై చర్చించగా, ఒబామా నిర్ణయానికి అనుకూలంగా 137 ఓట్లు మాత్రమే వచ్చాయి. 289 మంది ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే, ఒబామా అధ్యక్ష హోదాలో దీన్ని 'వీటో' చేసే అవకాశాలు ఉన్నాయి. మరో తొమ్మిది మంది ప్రతినిధులు వ్యతిరేకంగా ఓటేస్తే, మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చి ఒబామాకు వీటో హక్కు దూరమవుతుంది. ఇక ఈ విషయంపై తదుపరి జరిగే చర్చలో రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయన్న విషయం ఆసక్తికరంగా మారింది.