: జపాన్ ఆగ్నేయ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం


జపాన్ ఆగ్నేయ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అక్కడి బోనిన్ దీవులకు 112 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే కేంద్రం గుర్తించింది. రాజధాని టోక్యోకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ దీవులు ఉన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే వెంటనే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News