: బీజేపీ బాటలోనే కాంగ్రెస్ సీఎం... కాంగ్రెస్ కు ఇబ్బందికరం


గోమాంసంపై బీజేపీ ముఖ్యమంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా అల్లకల్లోలం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి జాబితాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చేరారు. గోమాంసం తినే వారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ నిప్పులు చెరిగారు. గోహంతకులకు, గోమాంస భక్షకులకు మన దేశంలో నివసించే హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవులను చంపేవారు ఏ మతానికి చెందిన వారైనా సరే, వాళ్లు ఈ దేశానికి అతిపెద్ద శత్రువులు అని అన్నారు. గోహంతకులను కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఓ వైపు దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మార్చ్ చేస్తూ ఉంటే... మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. బీజేపీ పాలిత హర్యాణా ముఖ్యమంత్రి ఖట్టర్ కూడా ఇటీవల గోమాంసంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

  • Loading...

More Telugu News