: కారుపైకి ఎక్కేసిన ఆర్టీసీ బస్సు!... చిత్తూరు జిల్లాలో ఐదుగురు దుర్మరణం


ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఓ కారుపైకి ఆర్టీసీ బస్సు చక్రాలు ఎక్కేశాయి. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుప్పం నుంచి బయలుదేరిన కారులో ఐదుగురు వ్యక్తులు పలమనేరు వస్తున్నారు. మరికాసేపట్లో వారంతా పలమనేరు చేరుకునేవారే. అయితే ఆర్టీసీ బస్సు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. చిత్తూరు నుంచి కుప్పం వెళుతున్న బస్సు బైరెడ్డిపల్లి మండలం మిట్టకురవపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు చక్రాలు కారు పైకి ఎక్కేశాయి. ప్రమాదంలో కారులోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. బస్సులోని పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News