: పాకిస్థాన్ నాకు అత్తవారిల్లుగా మారింది: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ఆవేదన


పాకిస్థాన్ క్రికెటర్, రాజకీయ నేత అయిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ‘పాక్’ పై మండిపడింది. తమ వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకున్నారని, దీంతో దేశమంతా తనకు అత్తవారిల్లులా మారిందని వ్యాఖ్యానించింది. ఎవరైనా ఏమైనా అనచ్చు అనే విధంగా తయారైందని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గార్డియన్ పత్రికకు ఆమె రాసిన వ్యాసంలో ఈ విషయాలను పేర్కొంది. నిరక్షరాస్యురాలైన ఒక నిరుపేద మహిళ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అక్కడ తన పరిస్థితి కూడా అదేవిధంగా ఆనాడు ఉందని, పాకిస్థాన్ తనకు ససురాల్ (అత్తిల్లు)లా తయారైందని పేర్కొంది. అయితే, తమ విడాకుల విషయంలో ఎవరి ప్రమేయం లేదని చెప్పింది. కేవలం తామిద్దరమే తీసుకున్న నిర్ణయమని ఆ వ్యాసంలో రాసింది.

  • Loading...

More Telugu News