: రాహుల్ పై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తునకు ఆదేశించండి: సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఒక లేఖ రాశారు. బ్రిటన్ లో కార్పొరేట్ కంపెనీని నెలకొల్పిన రాహుల్ అసలు భారతీయుడే కాదని ఇటీవల ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. బ్రిటన్ లోని కార్పొరేట్ కంపెనీ షెల్ కు రాహుల్ సెక్రటరీగా, డైరైక్టరుగా ఉండి ఉండవచ్చని, ఈ నేపథ్యంలోనే ఆయనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆ లేఖలో కోరారు. రాహుల్ పై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తునకు ఆదేశించేందుకు తాను పొందుపరిచిన వివరాలు చాలని ప్రధానికి రాసిన ఆ లేఖలో సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.