: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేయడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 359 పాయింట్లు లాభపడి 25,842కి ఎగబాకింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 7,843కి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్... ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (6.91%), ఇంజినీర్స్ ఇండియా (5.91%), కేఈసీ ఇంటర్నేషనల్ (5.03%), మంగళూరు రిఫైనరీ (4.85%), పీఎంసీ ఫిన్ కార్ప్ (4.82%). టాప్ లూజర్స్... బలరాంపూర్ చీనీ (-8.77%), శ్రీ రేణుకా షుగర్స్ (-8.15%), ఈఐడీ ప్యారీ (-2.75%), మైండ్ ట్రీ లిమిటెడ్ (-2.46%), కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (-2.17%).