: మావోయిస్టు నేత గాజర్ల అశోక్ లొంగుబాటు?
నిషిద్ధ మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్ నేత గాజర్ల అశోక్ లొంగిపోయాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన దండకారుణ్య కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఆయన అనారోగ్యం కారణంగానే పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. కాగా అశోక్ పై ప్రభుత్వం తరపునుంచి రూ.20 లక్షల రివార్డు ఉంది. రెండో రోజుల్లో ఆయన్ను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచే అవకాశముందని తెలిసింది.