: టాప్ 'సీక్రెట్'ను బయటపెట్టిన జేమ్స్ బాండ్ భార్య!


జేమ్స్ బాండ్ సినిమా పాత్రధారులకు ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానగణం ఉంటుంది. అలాగే జేమ్స్ బాండ్ తాజా పాత్రధారి డేనియల్ క్రెయిగ్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ప్రత్యర్థులు, సహచరులతో రొమాన్స్ చేసే జేమ్స్ బాండ్ డేనియల్ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాచిలర్ అని అందరూ అనుకుంటారు. అయితే, ఈయన బ్యాచిలర్ కాదనీ, పెళ్లయిన వాడనీ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ విషయాన్ని నటి రాచెల్ వెయిజ్ వెల్లడించింది. పైగా, తనే ఆయన భార్యనని చెప్పింది! 2010లో 'డ్రీమ్ హౌజ్' అనే సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన పరిచయం అతనితో పరిణయానికి దారితీసిందని ఆ సినిమాలో ప్రధాన పాత్ర పొషించిన రాచెల్ వెయిజ్ తెలిపింది. దీంతో 2011లో తామిద్దరం సీక్రెట్ గా వివాహం చేసుకున్నామని చెప్పింది. జేమ్స్ బాండ్ సినిమాల్లోని హీరో పాత్రకు మహిళల్లో మంచి క్రేజ్ ఉంటుందని, అందుకే దానిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, ఇంతవరకు ఈ విషయం రహస్యంగా ఉంచామని ఆమె తెలిపింది. కాగా, జేమ్స్ బాండ్ తాజా సినిమా 'స్పెక్టర్' పలు దేశాల్లో రిలీజ్ కాగా, ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాయే జేమ్స్ బాండ్ సిరీస్ లో చివరి సినిమా అని భావిస్తుండడంతో ఈ సీక్రెట్ ను రివీల్ చేసినట్టు ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News