: సాయం చేయండప్పా!... రాజ్ నాథ్ కు ‘అమ్మ’ ఫోన్!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా వెల్లువెత్తిన తుపాను తమిళనాడును ముంచెత్తింది. యావత్తు రాష్ట్రాన్నే కాక ఏకంగా రాజధాని చెన్నైని వరద నీటిలో ముంచేసింది. వారానికి పైగా విద్యాలయాలు తెరచుకోలేదు. వంద మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. రవాణా వ్యవస్థ స్తంభించగా, జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే వరద సహాయక చర్యల క్రింద రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన తమిళనాడు సీఎం జయలలిత ఇక కేంద్రం సాయంవైపు దృష్టి సారించారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసిన జయలలిత, రాష్ట్రంలో వరద పరిస్థితిని పూర్తిగా వివరించారు. వరదల్లో చిక్కుకున్న తమ ప్రజలకు ఆపన్న హస్తం అందించాలని ఆమె రాజ్ నాథ్ ను కోరారు. వీలయినంతమేర ఆర్థిక సాయం చేయడమే కాక సాధ్యమైనంత త్వరలో నిధులు విడుదల చేయాలని అభ్యర్థించారు.