: షబ్బీర్ అలీపై విచారణ జరిపిస్తాం: మహమూద్ అలీ
కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత అయిన షబ్బీర్ అలీపై టీఎస్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కాంగ్రెస్ పాలనలో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అండదండలతో షబ్బీర్ అలీ అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ల్యాంకో హిల్స్ లో షబ్బీర్ కుమారుడికి వాటా ఉందని... ఆ కంపెనీలో అతను డైరెక్టర్ కూడా అని చెప్పారు. షబ్బీర్ పాలన అంతా అవినీతిమయమని తెలిపారు. షబ్బీర్ అలీ భూకబ్జాలపై విచారణ జరిపిస్తామని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.