: తోడు దొంగల్లా వచ్చి చెవుల్లో పూలు పెట్టారు: సీపీఐ నారాయణ
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి శంకుస్థాపనకు తోడు దొంగల్లా వచ్చి, ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖంపై మోదీ మట్టి కొట్టారని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేరుగా మోసం చేస్తుంటే, చంద్రబాబు పరోక్షంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం సరికాదని... ఆత్మహత్యా సదృశమని అన్నారు.