: కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఎంటెక్ విద్యార్థి విజయ్ అరెస్ట్


వరంగల్ లోక్ సభ పరిధిలో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ సభలో నిరసన తెలిపిన మనువాడ విజయ్ అనే ఎంటెక్ విద్యార్థిని ఖమ్మం జిల్లా కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు తల్లిదండ్రులనూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థి కరీంగనర్ జిల్లా వేములవాడకు చెందిన వ్యక్తని తెలిసింది. విజయ్ ను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు తరలించి ఎస్ఐబీ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్టు సమాచారం. అతనికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విజయ్ ను, కుటుంబ సభ్యులను వదిలిపెట్టాలని డిమాండ్ చేశాయి. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంటెక్ చదువుతున్న అతను ప్రస్తుతం దళిత ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News