: నరేంద్ర మోదీ ఫోటో, భారత జెండాతో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన టర్కీ
ఇటీవల టర్కీలో జరిగిన జీ-20 దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశం అరుదైన సత్కారంతో గౌరవించింది. మోదీ పేరిట ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దీనిలో మోదీ చిత్రంతో పాటు భారత జెండా, కింద "నరేంద్ర మోదీ - ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా" అని రాసుంది. దీని ధర 2.80 తుర్కిష్ లిరాలుగా (సుమారు రూ. 65 - గురువారం ఉదయం ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ లో ఒక్కో లిరా రూ. 23.17 పలుకుతోంది) టర్కీ సర్కారు వెల్లడించింది. మోదీతో పాటు సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతల చిత్రాలతో కూడిన స్టాంపులూ విడుదలయ్యాయి.