: సరికొత్త, వినూత్న కాన్సెప్ట్, బైక్ టాక్సీలు వచ్చేస్తున్నాయి... మహిళలకూ సౌకర్యమే!


కాల్ ట్యాక్సీలు, క్యాబ్ సర్వీసుల మాదిరిగా, ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్ బైక్ టాక్సీలు. ఇటీవలి కాలంలో ఈ కాన్సెప్టుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పెరుగుతుండగా, ఈ విధానానికి హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. దీంతో దేశ రాజధానిలో బైక్ టాక్సీలు రావడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే స్వీడన్, చైనా, కామెరూన్, కంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నాం, బ్రెజిల్ తదితర దేశాల్లో రోడ్లపై ఇవి చక్కర్లు కొడుతున్నాయి కూడా. ఇవి రోడ్లపై తిరుగుతూ, ముందుగా బుక్ చేసుకున్న వారి వద్దకు వెళ్లి, వారి చేతుల్లో ఓ హెల్మెట్ పెట్టి, చేరాలనుకున్న గమ్యానికి చేరుస్తాయి. ఢిల్లీ ఐఐటీలో విద్యను అభ్యసించిన అశుతోష్ జోహ్రీ ఈ కాన్సెప్టును ఇండియాకు తెచ్చారు. ఈ నెలాఖరులోగా 100 మోటార్ సైకిళ్లతో సేవలందిస్తామని చెబుతున్న ఆయన కస్టమర్ స్త్రీ అయినా, పురుషుడైనా వారి భద్రతే తమకు ముఖ్యమని చెబుతున్నారు. తమ రైడర్లు పూర్తి శుభ్రతతో, డ్రైవింగ్ లో నైపుణ్యంతో ఉంటారని, మర్యాద తెలిసిన వారని తెలిపారు. వెనక కూర్చున్న వారికి సౌకర్యంగా ఉండేందుకు రైడర్ జాకెట్ కు హ్యాండ్ రెస్ట్ గ్రిల్స్ ఉంటాయని, వీటి సాయంతో మహిళలు సౌకర్యంగా కూర్చోవచ్చని తెలిపారు. ఈ బైకులను దూరం నుంచి చూసి కూడా గుర్తు పట్టేలా ప్రత్యేక యూనిఫాంను తయారు చేశామని వివరించారు. ఇక బైక్ టాక్సీలు త్వరలో హైదరాబాద్ కు కూడా వచ్చేస్తాయనడంలో సందేహం ఏముంది?

  • Loading...

More Telugu News