: పేర్ని నానికి బెయిలొచ్చింది!
రెవెన్యూ అధికారులను అడ్డుకున్న కేసులో వైకాపా నేత పేర్ని నానికి కోర్టు ఈ మధ్యాహ్నం బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేయగా, కోర్టు నేడు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. అంతకుముందు ఈ మధ్యాహ్నం ఆయన్ను వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ సహా పలువురు ములాఖత్ లో భాగంగా కలుసుకున్నారు. బందరు పోర్టు భూసేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా సోమవారం మచిలీపట్నంలో నాని ధర్నా నిర్వహించగా, పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.