: మేయర్ అనురాధ దంపతులకు సీఎం చంద్రబాబు నివాళులు
చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల భౌతికకాయాలకు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనురాధ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎంతో పాటు ఆయన తనయుడు లోకేష్, కళా వెంకట్రావు తదితర పార్టీ నేతలు అనురాధ దంపతులకు నివాళులర్పించారు. అంతకుముందు చిత్తూరు, నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వేను అర్థాంతరంగా ముగించారు. అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గం ద్వారా చిత్తూరుకు బయలుదేరి వెళ్లారు.