: నాన్ సబర్బన్ రైళ్లలో కనీస చార్జీ పెంచిన రైల్వేశాఖ
నాన్ సబర్బన్ రైళ్లలో కనీస ప్రయాణ టికెట్ ధరను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం రూ.5గా ఉన్న టికెట్ ధరను రూ.10కి పెంచింది. ఈ పెంచిన ధర ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫ్లాట్ ఫాం మీద రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ లో ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పది రూపాయలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులు ఫ్లాట్ ఫాం టికెట్ కొనే బదులుగా కనీస ప్రయాణ టికెట్ ను కొనుగోలు చేస్తున్నట్టు రైల్వే అధికారులకు తెలిపింది. దాంతో కనీస ప్రయాణ టికెట్ ధరను పైవిధంగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయించింది.