: జెట్, ఇండిగో, స్పైస్ జెట్ లకు సీసీఐ భారీ జరిమానా


విమానయాన సంస్థలు జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్ లకు 'కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) భారీ జరిమానా విధించింది. జెట్ కు రూ.151.69 కోట్లు, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో)కు రూ.63.74 కోట్లు, స్పైస్ జెట్ కు రూ.42.48 కోట్లు మొత్తంగా రూ.258 కోట్ల జరిమానా విధించింది. అవాంఛనీయ వ్యాపార ధోరణులకు పాల్పడినందుకుగాను సదరు సంస్థలకు జరిమానా విధించినట్టు ఈ మేరకు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపింది. పౌర విమానయాన రంగంలో సరకు రవాణా విభాగంలో ఇంధన సర్ చార్జి నిర్ణయించే విషయంలో పరస్పరం సదరు కంపెనీలు కుమ్మక్కయ్యాయంటూ ఎక్స్ ప్రెస్ ఇండస్ట్రీ కౌన్సిల్ ఫిర్యాదు చేసింది. చార్జీల నిర్ణయం కోసం పైమూడు విమానయాన సంస్థలు కుమ్మక్కవడం పరోక్షంగా రేట్లను తమకు అనుకూలంగా నిర్దేశించడమే అవుతుందని, కాంపిటీషన్ చట్టంలోని మూడో సెక్షన్ కు ఈ ధోరణి విరుద్ధమని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలాంటి పోటీ నిరోధక విధానాలు దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతమని పేర్కొంది. అయితే ఎయిర్ ఇండియా, గో ఎయిర్ లైన్స్ పై కూడా కౌన్సిల్ ఫిర్యాదు చేసినా సీసీఐ ఈ సంస్థలపై ఎలాంటి జరిమానా విధించలేదు.

  • Loading...

More Telugu News