: చిత్తూరు హత్యలకు వాడిన రివాల్వర్ ‘అనంత’లో కొన్నారా?...కూపీ లాగుతున్న పోలీసులు


చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ లపై నిన్న దుండగులు మెరుపు దాడి చేశారు. కఠారి దంపతులపై కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో దాడి చేసిన దుండగులు పరారవుతున్న క్రమంలో పాయింట్ 32 రివాల్వర్ ను అక్కడే వదిలేసి వెళ్లారు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ రివాల్వర్ ను నిందితులు చిత్తూరుకు పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలో కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల అక్రమ ఆయుధాల విక్రయాలకు సంబంధించి అనంతపురం పోలీసులు ఆ జిల్లాలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఆ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చిత్తూరులో మేయర్ దంపతుల హంతకులు వదిలి వెళ్లిన రివాల్వర్ కూడా అనంతపురం జిల్లాలోనే కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అంతేకాక అనంతపురం జిల్లాకు చెందిన ఎవరైనా ఈ దాడిలో పాలుపంచుకున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. దీంతో చిత్తూరులో నిన్న జరిగిన ఘటన అనంతపురం జిల్లా పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.

  • Loading...

More Telugu News