: అమెరికన్ ప్రెసిడెంట్ రేస్ నుంచి తప్పుకున్న 'మనోడు'
తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడబోవడం లేదని లూసియానా గవర్నర్, ప్రవాస భారతీయ సంతతి నేత బాబీ జిందాల్ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని, రిపబ్లికన్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి తన పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. తాను పోటీ పడేందుకు ఇది సరైన సమయం కాదని భావించిన మీదటే వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపారు. బాబీ తప్పుకోవడంతో రిపబ్లికన్ల తరపున ఇంకా 14 మంది ప్రెసిడెంట్ రేసులో మిగిలివున్నారు. కాగా, ఓటర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడం, నిధుల సమీకరణలో అసంతృప్తి, డొనాల్డ్ ట్రంప్ వంటి బలమైన ప్రత్యర్థులు... ఇత్యాది కారణాలతో బాబీ జిందాల్ తప్పుకున్నట్టు తెలుస్తోంది.