: న్యూజిలాండ్ లో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి
న్యూజిలాండ్ లోని టౌరంగా ప్రాంతంలోని ఓ సరస్సులో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సరస్సు వద్దకు వచ్చిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ అందులో పడగా, మరో విద్యార్థి అతన్ని రక్షించడానికి దిగి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ బయటకు తీశారు. వీరు ఎవరన్న విషయం తెలియరాలేదని, వీరి వయసు 20 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలున్న చిత్రాలను ప్రచురిస్తూ, అక్కడి మీడియా వీరిని గుర్తించాలని కథనాలు ప్రచురించింది.