: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు: పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్
‘పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే. కానీ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు’ అని పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించాడు. టీమ్ మేనేజర్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్న తర్వాతే పార్టీకి వెళ్లానని చెప్పాడు. క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించలేదని పీసీబీకి వివరణ ఇచ్చే యత్నం చేశాడు. కాగా, ప్రస్తుతం ఉమర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇంగ్లండ్ తో వచ్చే నెలలో జరిగే 'ట్వంటీ 20' టీమ్ నుంచి ఈ కుర్రాడిని తొలగించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ జట్టులోని 16 మంది బృందంలో ముందు అక్మల్ కు చోటు కల్పించినా... అనంతర పరిణామాల నేపథ్యంలో అతనిపై వేటు పడింది.