: పిచ్చి పనులు చేసే వాళ్లను చూసి భయపడం: కేసీఆర్
పిచ్చి పనులు చేసే వాళ్లను చూసి భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలకు వరంగల్ ప్రజలు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రతిపక్షనేతలు ప్రభుత్వానికి ఒక్క మంచి సూచన చేసిన పాపాన కూడా పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.