: ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎక్కడ?: కాంగ్రెస్ నేత రఘువీరా


ముంపు ప్రాంతాల్లో అధికారులు కనిపించడం లేదని, ఎక్కడున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయని రఘువీరా ఆరోపించారు.

  • Loading...

More Telugu News