: ఆహారం లేక గ్రామస్తుల అవస్థలు... వెనుదిరిగిన రెండు హెలికాఫ్టర్లు !


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కొలనుకుదురు గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులు మేడలపైకి చేరారు. ఈ రోజు ఉదయం నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు సమాచారమిచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలన్నింటికీ రేపు కూడా సెలవు ప్రకటించారు. కాగా, నెల్లూరులో సహాయక చర్యలు అందించేం నిమిత్తం బయలుదేరిన రెండు హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుతిరిగాయి.

  • Loading...

More Telugu News