: చెన్నై వీధుల్లో ‘ఓలా’ బోటు సర్వీసులు !


తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా... ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వీధులన్నీ జలమయం కావడంతో, బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బోటింగ్ సర్వీసులను ప్రారంభించాలంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఓలా సంస్థ రంగంలోకి దిగింది. ప్రత్యేక బోటింగ్ సర్వీసుల ద్వారా వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన బోటింగ్ సిబ్బందిని సదరు సంస్థ నియమించింది. కాగా, చెన్నై నగర వీధులన్నీ జలమయం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని వీధుల్లో ఈ సమస్య లేకపోయినప్పటికీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సీఎం జయలలిత తన సొంత నియోజకవర్గమైన రాధాకృష్ణ నగర్ లో వర్షం కారణంగా దెబ్బతిన్న బాధితులను పరామర్శించేందుకు నిన్న వెళ్లారు. అయితే, ట్రాఫిక్ జామ్ లో ‘అమ్మ’ కాన్వాయ్ కూడా చిక్కుకుపోయింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కే ఇటువంటి పరిస్థితి తప్పలేదంటే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పనక్కర్లేదు!

  • Loading...

More Telugu News