: చిత్తూరు మేయర్ పై ఐదుగురు హత్యకు పాల్పడ్డారు: జిల్లా ఎస్పీ శ్రీనివాస్


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. చిత్తూరు నగర మేయర్ ఛాంబర్ లో కాల్పులు జరిగాయని, ఘటనా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు, కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కఠారి మోహన్ పై రెండు రౌండ్ల కాల్పులు జరిపి, వీపు భాగంపై కత్తులతో పొడిచారని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ ఈ వివరాలు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. నిందితులు జిల్లా దాటివెళ్లకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News