: చిత్తూరు బయలుదేరిన ఏపీ మంత్రులు... చిత్తూరులో 144 సెక్షన్ విధింపు
చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేసిన ఘటనపై ఏపీ మంత్రులు స్పందించారు. హోంమంత్రి చినరాజప్ప, మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు బయలుదేరి వెళ్లారు. మరోవైపు మేయర్ దంపతులపై ఘటన నేపథ్యంలో చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. నగరంలో 144 సెక్షన్ విధించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మేయర్ దంపతులపై జరిగిన సంఘటనా స్థలాన్ని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో ఉన్న రత్న పరిశీలించారు. జిల్లాలో హైఅలెర్ట్ ప్రకటించినట్టు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఈ ఘటనలో చిత్తూరుకు చెందిన ఓ కార్పోరేటర్ తమ్ముడికి కూడా తీవ్ర గాయాలయినట్టు తెలిసింది. ఇదిలా ఉంచితే, దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.