: హాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశం లేదంటున్న సల్మాన్


బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నటీనటులకు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించాలన్న కోరిక ఉంటుంది. అందుకే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయా' సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ, హాలీవుడ్ నటులు చాలా కష్టపడి సినిమా చేస్తారని, కానీ మన దగ్గర సక్సెస్ అవడానికి అంత శ్రమపడాల్సిన అవసరం లేదని అన్నాడు. హాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి, అక్కడ ఈ స్థాయి గౌరవం పొందడానికి చాలా సమయం పడుతుందని చెప్పాడు. ఇక్కడ (బాలీవుడ్ లో) ఇంత సక్సెస్, మర్యాద ఉన్నప్పుడు హాలీవుడ్ కు వెళ్లాల్సిన పనేంటి? అని సల్లూ ప్రశ్నించాడు. బాలీవుడ్ లో తనిప్పుడు ఉన్న స్థాయిని దక్కించుకోవడానికి చాలా ఏళ్లు కష్టపడ్డానని, మళ్లీ అక్కడ కూడా కష్టపడటం ఎందుకని అభిప్రాయపడ్డాడు. అసలు తనకు హాలీవుడ్ కి వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News