: బాక్సైట్ జీవోను పూర్తిగా రద్దు చేయండి... ఏపీ ప్రభుత్వానికి సీపీఐ నారాయణ డిమాండ్
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా జీవో నిలిపివేసి మళ్లీ తవ్వకాలు జరపాలని చూస్తే గిరిజనులు చంద్రబాబు గుండెల్లో నిద్ర పోతారని విశాఖలో వ్యాఖ్యానించారు. ఇక సేవారంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతకు బీహార్ ఫలితాలే చక్కటి నిదర్శనమని చెప్పారు. ఏపీ ప్రజలపై సానుభూతి చూపవద్దని, విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలని నారాయణ కోరారు.