: నోకియా ఇండియా అధ్యక్షుడిగా సందీప్ గిరోత్రా నియామకం
నోకియా ఇండియా కంపెనీ అధ్యక్షుడిగా సందీప్ గిరోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు నోకియా ఇండియా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థ ఉపాధ్యక్షుడిగా, నోకియా నెట్ వర్క్స్ హెడ్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. అయితే ఫ్రెంచ్ కంపెనీ అల్కాటెల్-ల్యూసెంట్ కంపెనీని నోకియాలో కలిపేస్తున్న నేపథ్యంలో గిరోత్రాను హెడ్ గా నియమిస్తున్నట్టు నోకియా వెల్లడించింది. 1996లో నోకియా నెట్ వర్క్ లో చేరిన ఆయన వివిధ పదవుల్లో పనిచేసి, తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు.