: దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం... లిఫ్ట్ లో ఇరుక్కుని చిన్నారి మృతి


అభంశుభం తెలియని ఓ చిన్నారి నాలుగేళ్లకే లోకం విడిచి వెళ్లిపోయింది. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యుఒడి చేరింది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పరిధిలో ఉన్న సార్క్ కిడ్స్ అనే ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. జహానా అనే చిన్నారి ఎప్పటిలానే ఈ ఉదయం పాఠశాలకు వెళ్లింది. పైఅంతస్తులోని తరగతి గదికి వెళ్లేందుకు తోటి విద్యార్థులతో కలసి లిఫ్టు ఎక్కుతుండగా, ఆ చిన్నారి లిఫ్ట్ గ్యాప్ లో ఇరుక్కుపోవడంతో తల తెగిపోయి, ప్రాణాలు విడిచింది. ఘటనతో స్కూల్ విద్యార్థులు హతాశులయ్యారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తీవ్రంగా రోదిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఘటన గురించి తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News