: ఓటు అడిగే హక్కు మా పార్టీకే ఉంది: వరంగల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్


‘టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలు ఎన్నికల హామీలను ఇంత వరకూ నెరవేర్చలేదు. కుట్రలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. కనుక ఓటు అడిగే హక్కు మా పార్టీకే ఉంది’ అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో తొలిరోజు ఆయన ప్రచారానికి మంచి స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ నుంచి వర్ధన్నపేట మండలంలోకి ప్రవేశించారు. దమ్మన్నపేట వద్ద పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

  • Loading...

More Telugu News