: దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?: కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే
‘తెలంగాణ బిల్లుపై నాడు సోనియా గాంధీ సంతకం చేయడం నా అదృష్టం. సోనియా తీసుకున్న కఠోర నిర్ణయం కారణంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. కానీ, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ తన హామిని మాత్రం నిలబెట్టుకోలేదు’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.