: చిన్నారుల కోసం స్వైప్ నుంచి తొలి స్మార్ట్ ఫోన్
చిన్నారుల కోసం తొలి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల సంస్థ స్వైప్ ప్రత్యేకంగా 'స్వైప్ జూనియర్' పేరుతో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. తల్లిదండ్రులు నియంత్రించగలిగే విధంగా సరికొత్త ఫీచర్లతో పిల్లలకు ఉపయోగపడేలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయి. దానిలోని ఫీచర్ల ద్వారా పిల్లలు ఫోన్ ఎలా వినియోగిస్తున్నారో తల్లిదండ్రులు పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ల ద్వారా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. దాని ధర రూ.5,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లో 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 4జీబీ మెమొరీ ఇంటర్నల్ సదుపాయం కల్పించారు.