: అంచనాలను మించి పతనమైన భారత పారిశ్రామికోత్పత్తి
గడచిన సెప్టెంబరులో భారత పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అంచనాలను మించి పడిపోయింది. ఐఐపీ గణాంకాలు నిరుత్సాహకరంగా ఉంటాయని ముందుగానే ఊహించినప్పటికీ, భారీ పతనం ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. సెప్టెంబరులో గనుల రంగం వృద్ధి మందగించడంతో ఐఐపీ కేవలం 3.6 శాతం వృద్ధికి పరిమితమైంది. ఇదే సమయంలో వినియోగ ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబరులో 5 శాతానికి చేరుకుంది. సెప్టెంబరులో 4.41 శాతంగా ఉన్న ఇన్ ఫ్లేషన్ పెరిగినప్పటికీ, ఆర్బీఐ సంతృప్తికర స్థాయి 6 శాతం కన్నా కిందే కొనసాగడం గమనార్హం. ఇక పప్పుధాన్యాల కొరతతో రిటైల్ ఫుడ్ ఇన్ ఫ్లేషన్ 3.88 శాతం నుంచి 5.25 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాల ధరలు 33.25 శాతం పెరిగాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది.