: వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ దే గెలుపు: కేకే ధీమా


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక గెలుపుపై టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు ఖాయమైపోయిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కేకే పేర్కొన్నారు. ఈ క్రమంలో బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News