: టీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్ లలో వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు సంబంధించిన వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించాలంటూ లేఖలో తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చు ఇప్పటికే పరిధి దాటిందని చెప్పారు. ఈ క్రమంలో పసునూరిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ లేఖలో ఈసీని కోరారు.