: మూడో రోజునూ ముంచిన వర్షం... డ్రా దిశగా టెస్ట్ మ్యాచ్


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు తీరని అడ్డంకిగా మారాడు. మూడో రోజైన ఈ రోజు కూడా వర్షం కారణంగా ఆట రద్దయింది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో... ఈ రోజు ఆట ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోవడంతో రద్దు చేశారు. ఈ క్రమంలో వరుసగా నిన్న, ఈ రోజు రెండు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. ఆటకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపు అయినా ఆటకు వాతావరణం అనుకూలిస్తుందనే ఆశలు అంతగా లేవు. ఒక వేళ ఏదో ఒక సమయంలో ప్రారంభమైనా, ఆట సజావుగా కొనసాగుతుందన్న అంచనాలు కూడా లేవు. దీంతో, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో వైపు, తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికా 214 పరుగులకు ఆలౌట్ కాగా... టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసి మెరుగైన స్థితిలో ఉంది. మురళీ విజయ్ (28), శిఖర్ ధావన్ (45) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News